Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమలో మీ లావణ్య త్రిపాఠి... బడా నిర్మాత తనయుడితో...

మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:09 IST)

Widgets Magazine
allu sirish-lavanya

నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో పడిందట. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో. ఇప్పటికే ఈ విషయం తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2012 సంవత్సరంలో సినిమాల్లోకి వచ్చిన లావణ్య త్రిపాఠి చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ మోడల్ తెలుగును నేర్చేసుకుంది. అందరితో ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతోందట. 
 
అయితే లావణ్య గత కొన్నినెలలుగా అల్లు శిరీష్‌‌తో ప్రేమలో పడినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక ఫంక్షన్‌కు వెళ్ళినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. దీంతో ఇద్దరూ మెసేజ్‌లు, చాటింగ్, అప్పుడప్పుడు రెస్టారెంట్లలో కలవడంలాంటివి చేస్తున్నారట. సినీపరిశ్రమలో ఎవరెప్పుడు సన్నిహితంగా ఉంటారో చెప్పలేని పరిస్థితి. అయితే అల్లు శిరీష్‌‌కు పెద్దగా సినిమాలు లేవు. లావణ్య త్రిపాఠి చేతిలో మాత్రం ప్రస్తుతం తమిళంలో మూడు, తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటోంది.
 
అల్లు శిరీష్‌‌కు సినిమాలు లేకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట లావణ్య. కొంత మంది స్నేహితులు శిరీష్‌ ఇంకా సినీపరిశ్రమలో నిలదొక్కుకోలేదని చెబుతున్నా పట్టించుకోవడం లేదట. అంతగా ప్రేమలో మునిగిపోయింది లావణ్య. వీరి ప్రేమ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని అల్లు అరవింద్. సినిమా ఫీల్డ్ లో ఇవన్నీ మామూలేనన్న భావనలో ఆయన ఉన్నారట. అయితే వీరిద్దరు నిజంగా ప్రేమించుకుంటే వీరి ప్రేమ పెళ్ళి వరకు పోతుందో లేకుంటే సగంలో ఆగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భర్త భరణం డబ్బుతో జల్సా చేస్తున్నానా? నెటిజన్లకు ఘాటైన మలైకా అరోరా రిప్లై

కోటీశ్వరుడైన భర్తను వదిలివేసి భరణంగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తోందంటూ నెటిజన్లు చేసిన ...

news

సింగర్ సునీతతో అభిప్రాయబేధాలు మాత్రమే.. పోట్లాడుకోం: కౌసల్య

సింగర్ సునీతతో తనకు గొడవలున్నాయని.. ఆమెను తాను ఎడమొహంగా వుంటామని వచ్చిన వార్తల్లో నిజం ...

news

బిగ్ బాస్‌లో అదరగొట్టింది.. కానీ హౌస్ నుంచి ఓవియా అవుట్: వైరల్ అవుతున్న ''వీడియో'' చూడండి బాస్...

తమిళ బిగ్ బాస్‌లో అంతా తానై అదరగొట్టిన సినీ నటి ఓవియా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ...

news

టార్చర్ భరించలేకున్నా.. విడాకులు కావాలి : భర్తపై సింగర్ కౌసల్య ఆరోపణలు

కట్టుకున్న భర్తపై టాలీవుడ్ సింగర్ కౌసల్య సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త తనను ఎన్నో ...

Widgets Magazine