శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (15:16 IST)

లావణ్య త్రిపాఠి బాగా కో-ఆపరేట్ చేస్తుందట.. ఇపుడు సాయి ధరమ్‌ ఎంచుకున్నాడు...

'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. 'సోగ్గాడే చిన్నినాయనా', 'భలే భలే మగాడివోయ్' చిత్రాలతో మంచి పేరును కొట్టేసింది. పైగా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ప్రస్తుతం లావణ

'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. 'సోగ్గాడే చిన్నినాయనా', 'భలే భలే మగాడివోయ్' చిత్రాలతో మంచి పేరును కొట్టేసింది. పైగా వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ప్రస్తుతం లావణ్య చేతిలో రెండు తమిళ సినిమాలు, ఓ తెలుగు సినిమా ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో మరో క్రేజీ సినిమాలో లావణ్య ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్. 
 
మెగాస్టార్ చిరంజీవికి 'ఖైదీ నెం.150'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వి.వి. వినాయక్. ఇప్పుడు వినాయక్ మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధం కాగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 
 
ఈ కథలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి కరెక్ట్ గా సరిపోతుందని వినాయక్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. లావణ్య బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజు 'మిస్టర్' లావణ్య నటనకి మంచి మార్కులు పడిన విషయం తెల్సిందే. పైగా, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ అమ్మడు బాగా కో-ఆపరేట్ చేసిందట.