Widgets Magazine

సత్యరాజ్ హీరోగా "ఎమ్జీఆర్ బయోపిక్"... కోలీవుడ్‌లో హాట్‌టాపిక్

సోమవారం, 30 అక్టోబరు 2017 (10:48 IST)

Widgets Magazine
mgr biopic

ఒకవైపు తెలుగు చిత్రపరిశ్రమలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం తెరకెక్కనుంది. ఒకటి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తుండగా, మరొకటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీస్తున్నారు. ఇంకొకటి డైరెక్టర్ తేజ తీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు కోలీవుడ్‌లోనూ ఎమ్జీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. బాలకృష్ణన్‌ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్‌ 8వ తేదీన ప్రారంభంకానుంది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ముఖ్య అతిథిగా హాజరవుకానున్నారు. 
 
అయితే మరో పది రోజుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ చిత్రంలో ఎమ్జీఆర్ పాత్రకు ఇంకా ఎవర్నీ సెలక్ట్‌ చేయలేదు. ఈ పాత్ర కోసం చిత్ర బృందం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారట. కాగా, ‘బాహుబలి’లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు కోలీవుడ్‌ టాక్‌. 
 
అలాగే, డీఎంకే అధినేత కరుణానిధి పాత్రను ప్రకాష్ రాజ్‌తో చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటు సినిమా, అటు రాజకీయరంగంలో రాణించిన ఎన్టీఆర్, ఎమ్జీఆర్ బయోపిక్‌లు ఏకకాలంలో రూపొందనుండటం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ అయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

200 బౌన్సర్ల మధ్య నయనతార సాంగ్ అదిరింది..

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ...

news

ఘరానా మొగుడులోని ఆ పాటంటే ఇష్టం.. పొకెమాన్ ఆడుతుంటా: రష్మీ

''ఘరానా మొగుడు'' సినిమాలోని పాట తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీ నటి... యాంకర్ రష్మీ ...

news

యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందే : హీరోయిన్

సినీ యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందేనంటోంది ఓ హీరోయిన్, ఆ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ ...

news

రూ.200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా : హీరో రాజశేఖర్

తనకు అనుకూలంగాలేని సమయంలో అనేక చిత్రాలు చేశానని, ఆ కారణంగా రూ.200 కోట్ల మేరకు ఆస్తులు ...