Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహాభారతం.. రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్ కృష్ణుడైతే.. మహేష్ బాబు..?

శనివారం, 22 ఏప్రియల్ 2017 (10:08 IST)

Widgets Magazine

మహాభారతం.. రాజమౌళి కళల ప్రాజెక్టు. బాహుబలి అనుభవంతో రాజమౌళి మ‌హాభార‌తం తీస్తాడ‌నుకుంటే త‌న‌కు ఈ అనుభ‌వం స‌రిపోద‌ని జక్కన్న అంటున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మహాభారతం మీద ఆసక్తి ప్రదర్శిస్తుండటం.. కృష్ణుడి పాత్ర చేయాలని ఉందని కూడా ప్రకటించడంతో రాజమౌళి ఇటీవలే అతడిని కలిసి ఈ సినిమా గురించి చర్చించాడట. స్వయంగా రాజమౌళే ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ఇటీవ‌ల అమీర్‌ఖాన్‌ను క‌లిసి మ‌హాభార‌తం గురించి చ‌ర్చించాన‌ని… మహాభారతంలో నటించడానికి అమీర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడ‌ని రాజమౌళి తెలిపాడు.
 
ఇదిలా ఉంటే.. దుబాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బీఆర్ శెట్టి నిర్మాతగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న 'మహాభారతం' చిత్రంలో శ్రీకృష్ణుడిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మహేష్ బాబే శ్రీకృష్ణుడని, చిత్ర నిర్మాతలు ఆయన్ను సంప్రదించారని వచ్చిన వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు మహేష్ మేనేజర్‌ను వివరణ కోరగా, ఆయన ఈ వార్త పుకారేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రంతో మహేష్ బిజీగా ఉన్నారని, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తారని చెప్పారు. మహాభారతంలో మహేష్ బాబు నటించట్లేదని, అసలా ప్రతిపాదనే మహేష్ దగ్గరికి రాలేదని స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ముంబైలో కనీ వినీ ఎరుగని రీతిలో బాహుబలి-2 గ్రాండ్ ప్రీమియర్: బాలివుడ్ మొత్తాన్ని రప్పిస్తున్న కరణ్ జోహార్

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల ...

news

కర్ణాటకలో ‘బాహుబలి 2’ సినిమాపై అడ్డంకులకు ఇదా కారణం?

కర్నాటకలో బాహుబలి2 సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నడ సంఘాల వైనం నిశితంగా ...

news

బంక్ కొట్టినా ఫస్ట్ మార్కు నాదే.. నీవల్ల కాదంటే కసితో సాధిస్తా అంటున్న బ్యూటీ

చిన్నతనం నుంచి ఈ పని నీ వల్ల కాదు అని ఎవరైనా అని రెచ్చగొడితే దాన్ని సాదించే వరకూ ...

news

బాహుబలి రెమ్యునరేషన్ 75 కోట్లా.. నిర్మాతల నుంచి బాగానే పిండాడు మరి..

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో కూడా ఒక సినిమాకోసం అంత సమయం వెచ్చించలేదు... చిత్రం తీసిన ...

Widgets Magazine