సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 25 జులై 2020 (13:21 IST)

మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఉన్నట్టా..? లేనట్టా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు జన్మదినం ఆగష్టు 9న. ఆ రోజు మహేష్‌ అభిమానులకు పండగ రోజు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు మహేష్ బాబు కొత్త సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడమో.. కొత్త సినిమాని ప్రారంభించడమో చేసేవారు. అయితే... ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.
 
గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
ఆగష్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని... సెలబ్రేషన్స్ ఉంటాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
అయితే... కరోనా కారణంగా మహేష్ బాబు ఈ సంవత్సరం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏమీ చేసుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి నిర్ణయయే. అయితే... సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి అప్ డేట్ ఏదైనా ఇస్తారా..? పోస్టర్ ఏదైనా రిలీజ్ చేస్తారా..? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్...!