రాజమౌళి సినిమా... గరుడాలో మహేష్ బాబు.. 2020లో ప్రారంభమవుతుందా?

సోమవారం, 30 అక్టోబరు 2017 (15:22 IST)

బాహుబలికి తర్వాత దర్శకుడు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ 24వ సినిమా కొరటాల శివతో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లితో కమిట్ అయ్యారు. ఆ సినిమా పూర్తయ్యే సరికి 2018 సమ్మర్ దాటిపోతుంది. 
 
ఆ తర్వాత మహేష్ బాబు 26వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో వుంది. అంతేకాదు.. మహేష్ 27వ చిత్రం కూడా 14రీల్స్ కోసం సంతకం చేసేసినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు సినిమా సరిగ్గా 2019లో వుంటుందని సమాచారం. 2019 చివర్లో కానీ, 2020లో కానీ రాజమౌళి మహేష్‌ బాబుతో సినిమా తీసే ఛాన్సుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 
 
అయితే రాజమౌళి గరుడా సినిమాలో మహేష్ బాబు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనుందని.. నిర్మాత కె.ఎల్. నారాయణతో మహేష్ చేసే సినిమా గరుడ వేగ అని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Garuda Trivikram 14 Reels Ss Rajamouli Vamsi Paidipalli Mahesh Babu Play Lead Role

Loading comments ...

తెలుగు సినిమా

news

అర్జున్ రెడ్డితో నటుడిగా చెప్పలేని అనుభూతి పొందాను: విజయ్ దేవరకొండ

''అర్జున్ రెడ్డి'' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్‌ రెడ్డి వంగా ...

news

డీఎంకే సుప్రీం కరుణ మునిమనవడితో చియాన్ విక్రమ్ కూతురి పెళ్లి (ఫోటోలు)

కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. డీఎంకే సుప్రీమ్ ...

news

ఆ వేధింపులు నేనూ ఎదుర్కొన్నా : అనుపమా పరమేశ్వరన్

దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. ఈమె కోలీవుడ్, ...

news

శ్రీముఖి అందాలకు డైలాగులు తోడైతే.... గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ (వీడియో)

యాంకర్ కమ్ యాక్టర్‌గా మారిన శ్రీముఖి.. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాలో ...