శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (17:03 IST)

'మహర్షి' కోసం పోటీపడుతున్న ఆ ఇద్దరు హీరోయిన్లు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరిలేడు నీకెవ్వరు చిత్రంతో తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను వేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన నటించే చిత్రం కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రం లాక్‌డౌన్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ ఎవరన్నదానిపైనే ఇంతవరకు క్లారిటీ లభించలేదు. దీంతో చిత్ర హీరోయిన్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను దర్శకుడు సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు కీర్తి సురేష్ కాగా, మరొకరు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. 
 
నిజానికి బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్‌కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమె ప్రభాస్ సరసన 'సాహో' సినిమా చేసింది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేదు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకి సైన్ చేయలేదు. 
 
కానీ, పరశురామ్‌తో మహేశ్ బాబు చేయనున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందిస్తారట. అందువలన బాలీవుడ్ నుంచి శ్రద్ధా కపూర్‌ను తీసుకునే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం శ్రద్ధా వద్దని, కారణం సాహో మూవీని సాకుగా చూపిస్తున్నారట. ఏది ఏమైనా ఈ చిత్రం హీరోయిన్‌పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.