మంగళవారం, 18 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (22:20 IST)

మంచు మనోజ్-మౌనిక రెడ్డిల రెండో వివాహంపై క్లారిటీ ఇస్తుందా?

Manoj
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ - మౌనిక రెడ్డి వివాహంపై క్లారిటీ వచ్చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మనోజ్ చేసిన ట్వీట్ వైరలైంది. వీరిద్దరూ మనోజ్ -మౌనిక రెడ్డి రెండో వివాహం చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది. 
 
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ఇటీవలే అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఏకం కానున్నారని తెలుస్తోంది. తాజాగా మనోజ్ ట్వీట్ చేసినట్లుగా ఫిబ్రవరి నెలలో వీరి వివాహానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. 
 
వీరిద్దరి వివాహాన్ని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు కూడా ఇటీవలే ధ్రువీకరించారు. మనోజ్ అందరూ అంగీకరించడంతో 20వ తేదీన చేసే ట్వీట్ ద్వారా పెళ్లి విషయాన్ని ధ్రువీకరిస్తున్నారని తెలుస్తోంది.