గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (16:25 IST)

మంచు విష్ణు కన్నప్పలో స్టార్ హీరోల ప్రచార జోరు

Manchu Vishnu, Shiva Rajkumar
Manchu Vishnu, Shiva Rajkumar
విష్ణు మంచు కన్నప్ప సినిమాకు షూటింగ్ కంటే ప్రచార జోరు ఎక్కువైంది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో భాగస్వామి అయ్యారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. శివ రాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్‌ను త్వరలోనే అధికారిక ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది.
 
బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు.