మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (19:45 IST)

మరోమారు "ఆచార్య" మూవీ రిలీజ్ వాయిదా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఆచార్య" చిత్రం మరోమారు వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుంది. 
 
ఇక ఈ సినిమాలో చరణ్ ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఇప్పటికే శాంపిల్ గా వదిలిన 'లాహే లాహే' సాంగ్‌తో మణిశర్మ సంగీతానికి మంచి మార్కులు పడిపోయాయి. భారీ బడ్జెట్‌తో కొరటాల మార్కుతో రూపొందుతున్న ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలని భావించారు.
 
అయితే మే 14వ తేదీకి ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమే కావొచ్చనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఒక వైపున కరోనా తన ప్రతాపం చూపుతోంది .. ఇప్పటికే జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. మే నెల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియదు. 
 
ఇక తెలంగాణలో ఒక సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసయమంలో పరీక్షలు జరుగనున్నాయి. అందువలన దర్శక నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే ఒక టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఒకవేళ వాయిదా అంటూ పడితే, ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రావొచ్చన్నది తాజా సమాచారం.