ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:27 IST)

తండ్రి కాబోతున్న భల్లాలదేవ?

టాలీవుడ్‌లో వన్ అఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా జంట ఒకటి. త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే. వివరాల్లోకి వెళితే..  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది మిహికా.. అయితే ఇటీవల ఓ ఫ్రెండ్‌ వెడ్డింగ్‌లో రానా-మిహికా జంట సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది మిహిక..
 
ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో మిహిక కాస్త బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు మిహికా మీరు ప్రెగ్నెంటా అంటూ కామెంట్స్‌ చేశారు. దీనిపైన మిహికా స్పందిస్తూ నోనో వెయిట్ అంటూ సమాధానం ఇచ్చింది.
 
దీంతో మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది. ఇక రానా విషయానికి వస్తే ఇటీవలే భీమ్లానాయక్ మూవీతో సందడి చేసిన రానా.. విరాటపర్వం మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.