శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 14 డిశెంబరు 2020 (19:40 IST)

ఎలిమినేట్ అయినా మోనాల్ బాగా సంపాదించింది, ఎంతో తెలిస్తే షాకే?

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో తాజాగా ఎలిమినేట్ అయిన వారిలో మోనాల్ గజ్జర్ పైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. 14 వారాల పాటు హౌస్‌లో ఉన్న మోనాల్ ఏ బాధ లేకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయితే తాను అనుకున్న కోరికను నెరవేర్చులేకపోయానన్న బాధను మాత్రం తెలియజేసే ప్రయత్నం చేస్తోంది.
 
ప్రతి ఎపిసోడ్‌కు 11 లక్షల రూపాయల వరకు మోనాల్ గజ్జర్‌కు బిగ్ బాస్ షో యాజమాన్యం అందించిందట. అలా చూస్తే కోటి 50 లక్షల రూపాయల వరకు అందిందట. అసలు ఆ స్థాయిలో రావడం కూడా సంతోషంగా ఉందని చెబుతున్న మోనాల్.. బిగ్ బాస్ విజేతగా గెలిచి ఉంటే మరింతగా సంతోషంగా ఉండేదాన్నని మనస్సులోని మాటలను చెప్పేసింది.
 
నా కోసం మా అమ్మ ఎంతో కష్టపడింది. కనీసం బిగ్ బాస్‌లో డబ్బులు బాగా సంపాదించి మా అమ్మకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనుకున్నాను. అంతేకాదు నా చెల్లెలు కూడా ఉంది. విజేతగా నిలిచి ఆ డబ్బుతో సెటిల్ అవుదామనుకున్నాను. ఆ అవకాశం లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది.
 
దాంతో పాటు తను మొదట్లో ఎలాంటి కష్టాలు పడ్డానన్న విషయం చెప్పింది మోనాల్. చేసింది చాలా తక్కువ సినిమాలు. నన్ను నన్నుగా గుర్తించే వారు లేకుండా పోయారు. కానీ ఇప్పుడు మోనాల్ అంటే ఎంతో గౌరవం ఉంది. నాకంటూ అభిమానులున్నారంటూ చెపుతోంది మోనాల్.