శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (17:02 IST)

పవన్‌తో మురుగదాస్ సినిమా.. కత్తికి సీక్వెల్‌గా వస్తుందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్వరలో దర్శకుడు మురుగదాస్ సినిమా చేయబోతున్నాడని టాక్. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను మురుగదాస్ తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో త్వరలో దర్శకుడు మురుగదాస్ సినిమా చేయబోతున్నాడని టాక్. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను మురుగదాస్ తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న మురుగదాస్ పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి కామెంట్ చేశారు. నిజానికి పవన్‌తో ఎప్పుడో సినిమా చేయాల్సిందని, గజిని సినిమా కథ కూడా ఆయనకు వినిపించానని తెలిపారు. 
 
‘కత్తి’ సినిమా చూసి పవన్ అభినందించినట్లుగా మురుగదాస్ చెప్పుకొచ్చారు. అలాగే కత్తి కథను ఇంకా పొడిగించి వుంటే బాగుండేదని పవన్ సలహా ఇచ్చారని మురుగదాస్ చెప్పారు. ఇంకా కత్తి సినిమాకు సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నట్లు మురుగదాస్ చెప్పుకొచ్చారు. 
 
ఈ కథను పవన్‌కు వినిపించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ నచ్చితే మురుగదాస్‌తో పవన్ సినిమా ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా వున్న పవన్.. త్వరలో సినిమాలను పక్కనబెట్టి రాజకీయాల్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో మురుగదాస్‌తో సినిమా చేస్తారో లేదో వేచి చూడాలి.