ఆ హీరోయిన్‌ను కాకా పడుతున్న మెగా హీరో!

nabha natesh
ఠాగూర్| Last Updated: ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (13:33 IST)
మెగా ఫ్యామిలీక చెందిన పలువురు హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే అనేక మంది నిర్మాతలు ఈ కుర్రోడితో లోబడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు ఆసక్తిని చూపుతారు. అయితే, ఈ బ్యాచిలర్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎల్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. లాక్డౌన్ ప్ర‌భావంతో వాయిదా ప‌డ్డ ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ షురూ అయింది.

అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా ఈ రోజుతో ముగిసిపోయింది. దీంతో హీరోయిన్‌ నభా నటేష్‌ను హీరో సాయితేజ్ సర్‌ప్రైజ్ చేశాడు. నభా నటేష్ ఊహించని విధంగా ఓ బహుమతిని ప్రదానం చేశాడు. ఈ గిఫ్ట్ చూసిన నభా నటేష్.. ఫిదా అయిపోయిందట.
nabha natesh

ఈ బహుమతి ప్యాక్‌లో థ్యాంక్యూ న‌భా అని రాయ‌డంతో పాటు తెల్ల‌ని దుస్తులు, న‌భా ఫోటో ఫ్రేమ్, కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇవి చూసిన న‌భా తెగ ఫిదా అయింద‌ట‌. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా, ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన థీమ్ వీడియో, 'నో పెళ్లి' అనే సాంగ్‌తో పాటు 'హే ఇది నేనేనా' అనే సాంగ్స్ సినీ ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.
దీనిపై మరింత చదవండి :