గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (11:07 IST)

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

chai - shobita
పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్‌లు కానీ సినిమాలలో కానీ నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సమంత విషయంలో జరిగిన తప్పు తిరిగి శోభిత విషయంలో జరగకుండా ఉండటం కోసం నాగచైతన్య ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది. 
 
సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం సినిమాలే అని తెలుస్తుంది. సమంత ఎప్పుడైతే 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అదే విడాకులకు కారణమైందంటూ ఒకానొక సమయంలో వార్తలొచ్చాయి. 
 
తాజాగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరగనుంది. నాగ చైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.