శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (22:50 IST)

దర్శకేంద్రుడు ప్రయోగం ఫలిస్తుందా? ఇంతకీ హీరో ఎవరు?

టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ఓం నమో వెంకటేశాయ సినిమా తెరకెక్కించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు రాఘవేంద్రరావు. అయితే... ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేయనున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది.
 
తాజాగా ఈ సినిమా గురించి మళ్లీ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా ఆగిపోలేదని తెలిసింది. మూడు కథలు ఉండే ఈ సినిమాని ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తారని... ఈ మూడు కథలు చాలా వైవిధ్యంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
 
అయితే... ఇందులో ఓ యంగ్ హీరో నటిస్తాడని, ఆ హీరో నాగశౌర్య అంటూ వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించనున్నట్టు దర్శకేంద్రుడు తెలియచేసారు. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు చెబుతానన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని యంగ్ హీరో నాగశౌర్య దక్కించుకున్నట్టు తాజాగా ప్రచారం ఊపందుకుంది. ఇదే కనుక వాస్తవం అయితే... నాగశౌర్య లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.