శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (18:04 IST)

సాయిపల్లవితో సినిమా చేస్తూనే అనుపమతో నాని రొమాన్స్...

కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''ఎంసీఏ'' (మిడిల్ క్లాస్ అబ్బా

కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ''ఎంసీఏ'' (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగ్‌ను కూడా కానిచ్చేస్తున్నాడు. 
 
ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా కిషోర్ తిరుమలనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ ప్రాజెక్టుకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.