ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (17:05 IST)

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక సుకుమార్ ఉన్నాడని తెలిపిన నట్టికుమార్, ఛాంబర్ కమిటీ?

Jany, Jhansi
Jany, Jhansi
తాజా ఉదంతాలను బట్టి జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ప్రమేయం వుందని జానీ మాస్టర్ భార్య సుమలతతోపాటు నిర్మాత నట్టికుమార్, ఛాంబర్ కమిటీ కన్వీనర్ ఝాన్సీ, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కూడా తెలియజేశారు. పుష్ప 2 సినిమాలో ప్రత్యేక సాంగ్‌కు జానీ మాస్టర్‌ను అల్లు అర్జున్, సుకుమార్ సంప్రదించారట. డాన్స్ మూవ్‌మెంట్ విషయంలో తేడా రావడంతో జానీ మాస్టర్ తప్పుకున్నాడు. ఆ టైంలో ఆయన శిష్యురాలు ఎంట్రీ ఇచ్చిందట.
 
జానీని మొదట్లో అల్లు అర్జున్ వద్దన్నాడు.  తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు
 
అంతకుముందు అల వైకుంఠపురంలో.. బుట్టబొమ్మ... సాంగ్‌ను కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సాంగ్ విషయంలో అల్లు అర్జున్‌కు మూవ్‌మెంట్ నచ్చకపోవడంతో డాన్స్ వేయకుండా వెళ్ళిపోయాడు. అసలు అల్లు అర్జున్‌కు ఏమి కావాలో తెలుసుకున్న జానీ మాస్టర్ తమిళ్‌లో ఫేమస్ హీరో చేసిన మూవ్‌మెంట్ చూపిస్తూ ఇలా కావాలని అడిగాడట. అందుకు జానీమాస్టర్ ఆ మూవ్ మెంట్ నేనే చేశాను సార్ అని చెప్పడంతో తగ్గెదేలే అన్న మనిషి తగ్గి బుట్టబొమ్మ పాట చేశాడు. అది జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సారీ అని కూడా జానీకి చెప్పాడని అప్పట్లో ఆ డాన్స్‌కు పనిచేసిన పలువురు డాన్సర్స్ నేడు బయట పెట్టారు. 
 
పుష్ప 2 వివాదం ఎలా వచ్చిందంటే..
జానీ మాస్టర్‌కూ, ఆయన శిష్యురాలు స్రష్టి వర్మకు ఇటీవల కాలంలో కొంచెం చెడింది. ఒకరంగా చెప్పాలంటే తనే వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటుంది. అలాంటి టైంలో పుష్ప 2కు కొత్త మూవ్ మెంట్ కోసం సుకుమార్ జానీ మాస్టర్‌ను సంప్రదించడంతో అల్లు అర్జున్ చెప్పిన మూవ్ మెంట్స్ విషయంలో కొంచెం చర్చ జరిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ తాను చేయనని బయటకు వచ్చేశాడు. సరిగ్గా ఇదే టైంలో ఆయన శిష్యురాలు స్రష్టి వర్మను దర్శకుడు సుకుమార్ పిలవడం, అవకాశం ఇవ్వడం జరిగాయి. ఇది తెలిసిన జానీ మాస్టర్ సెట్లోనే ఆమెను నిలదీస్తే, వారిధ్దరి మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది. దాంతో మాటామాటా పెరిగి నువ్వెంత.. నువ్వెంత.. తగ్గేదేలా అన్నట్లుగా మారింది.
 
ఈ విషయాలన్నీ తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు అసలు జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక ఓ ప్రముఖ హీరో, దర్శకుడు వున్నాడని ఇటీవలే ఛాంబర్లో ఝాన్సీ కూడా చెప్పింది. జానీ మాస్టర్ భార్య అయితే ఏకంగా సుకుమార్ పేరు బయటపెట్టింది. ఇంతవరకు ఇష్యూ రావడానికి కారణం ఎవరికి వారు తగ్గేదేలా అన్నట్లు వ్యవహరించడమే కారణంగా తెలుస్తోంది. ఆమె పాటికి ఆమెను వదిలేసి వుంటే జానీ మాస్టర్ కేసు వరకు వెళ్లేది కాదు. విశ్వసనీయ సమాచారం మేరకు సుకుమార్ అండతో పోలీస్ కేసు వరకు సృష్టి వర్మ వెళ్ళిందని తెలుస్తోంది. దీనిపై పోలీసులు, కోర్టులు నిజానిజాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు తెలియగలవు.