'ఆచార్య'కు నిన్న భార్య.. నేడు చెల్లిగా నయనతార?
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తదుపరి ప్రాజెక్టు లూసిఫర్. మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సీనియర్ నటి నయనతారను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మిస్తున్న`ఆచార్య` చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్` సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం పలువురు ప్రముఖ కథానాయికలను పరిశీలించి చివరికి నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం. నయన్ ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె భర్త పాత్ర పోషించే నటుడి విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ పాత్ర పోషించే నటుడి పేరు కూడా కన్ఫామ్ అయ్యాక ఈ సినిమాలో నటీనటుల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం.