Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఉయ్యాలవాడ'లో రెండో హీరోయిన్‌ పేరు ఖరారు... రెమ్యునరేషన్‌గా రూ.4 కోట్లు?

సోమవారం, 17 జులై 2017 (09:12 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి". ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు.. మరో కీలక పాత్ర ధారిణి ఉండనున్నారు. ఒక కథానాయికగా ఐశ్వర్య రాయ్‍ను, మరో హీరోయిన్‌గా నయనతారను తీసుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
ఇందుకోసం నయనతార భారీగానే డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించే నయనతారకు 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్ర నిర్మాత అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సాధారణంగా ఒక భాషలో చేసే సినిమాకే నయనతార రెండున్నర నుంచి మూడు కోట్ల వరకూ తీసుకుంటుంది. 
 
ఈ సినిమా నాలుగు భాషలకి సంబంధించినది కావడంతో ఆమె రూ.4 కోట్లు డిమాండ్ చేయగా, అందుకు చిత్ర నిర్మాత సమ్మతించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాంచరణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన షూటింగ్ లాంఛనంగా ప్రారంభంకానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆకట్టుకున్న జూ. ఎన్టీఆర్.. వైవిధ్యత కరువైన బిగ్ బాస్.. ఇకపై రాణించేనా?

కొద్దినెలలుగా ఊరిస్తున్న బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఆదివారం ఆట్టహాసంగా ప్రారంభమైంది. ...

news

సెలబ్రటీ కాబట్టి నాన్నపై రాళ్లు విసరద్దు.. నోరు జాగ్రత్త అన్న పూరీ కుమార్తె

సెలబ్రిటీలు కాబట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, రాస్తే, టీవీల్లో ప్రసారం చేస్తే వారి ...

news

జూ.ఎన్టీఆర్ 'బిగ్ బాస్' లిస్ట్ ఇదే... ఆడియెన్స్ ఏమంటారో చూడాలి.... ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ లిస్ట్ ప్రకటించారు. మొత్తం 14 మందిని ...

news

హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం : ఉప్పందించిన భరత్ మొబైల్ కాల్‌లిస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా వెలుగుచూడటానికి ప్రధాన కారణం ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం ...

Widgets Magazine