సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (16:51 IST)

11ఏళ్ల తర్వాత తిరిగి ఒక్కటవుతున్న ప్రభుదేవా- నయన జోడీ?

దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార కెరీర్ ప్రస్తుతం పీక్‌లో వుంది. ఇక ఈమె వ్యక్తిగత జీవితంలోనూ పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇందులో నయన ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. సింబు, ప్రభుదేవా, విఘ్నేశ్ శివన్ అంటూ ఆమెది ముక్కోణపు ప్రేమ గురించి ఇంకా సోషల్ మీడియాలో టాక్ నడుస్తూనే వుంటుంది. 
 
ఇందులో ప్రభుదేవాతో ప్రేమాయణం తారాస్థాయికి చేరుకుంది. ఒక దశలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రేమ కూడా బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయన ప్రేమలో వుంది. త్వరలో వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు ఎక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 11 సంవత్సరాలకు తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో ఓ కొత్త సినిమాలో నయనతార నటించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్‌ నయనతార, ప్రభుదేవా సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఇదే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు విఘ్నేశ్ శివన్ ఒప్పుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి వుంది.