బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (19:57 IST)

చిరు ఆచార్యలో నిహారిక, ఇది నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆచార్య పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. 
 
అదీ కాకుండా చరణ్‌ పాత్ర దాదాపు అర గంట సేపు ఉంటుందని... చిరంజీవి - చరణ్‌ పై వచ్చే సన్నివేశాలు అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయని తెలిసింది. దీంతో ఆచార్య షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా..? అని ఆత్రుతగా ఎదరు చూస్తున్నారు అభిమానులు.
 
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 14న లేదా.. ఆగష్టు 22న భారీ స్ధాయిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రస్తుతం అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆచార్య సినిమాని ఆగష్టులో కాకుండా దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు నటిస్తున్నారని. ఇంతకీ ఎవరంటారా..? మెగా ఫ్యామిలీ నుంచి నట వారసురాలిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక. అవును.. నిహారిక ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిసింది.
 
నిహారిక ఒక మనసు సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. నాగశౌర్యతో కలిసి నటించిన ఒక మనసు సినిమా కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా.. నిహారిక మాత్రం పాత్రకు తగ్గట్టుగా బాగానే నటించిందనే పేరు తెచ్చుకుంది. ఆతర్వాత హ్యాపీ వెడ్డింగ్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో నటించింది. ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించింది. 
 
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న పాత్ర అయినా సరే.. చేయాలని పట్టుదలతో నిహారిక ఈ మూవీలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాలోను ఆమె ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. అయితే... ఈ విషయం అధికారికంగా తెలియాల్సి వుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై ఆచార్య యూనిట్ కానీ.. నిహారిక కానీ స్పందిస్తుందేమో చూడాలి.