శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (18:33 IST)

నిశ్శబ్ధంతో నిశ్శబ్ధమైపోయిన స్వీటీ..

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యూటీ అనుష్కకు ఒక ప్రత్యేకత ఉంది. టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక సైలెంట్‌గా ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా నిశ్శబ్ధం. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అంతకుముందు సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ క్యారెక్టర్లో నటించింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనుష్క. 
 
సైరా తరువాత అనుష్కకు అవకాశాలు పెరుగుతాయని.. ఇక ఆమెకు తిరుగేలేదని అభిమానులు భావించారు. కానీ ఒకే ఒక్క సినిమా నిశ్శబ్ధం అనే సినిమాలో నటించిన అనుష్క ఇప్పుడు నిజంగానే నిశ్శబ్ధమైపోయారు. డైరెక్టర్లు, నిర్మాతలెవరు అస్సలు అనుష్కను సంప్రదించడం లేదట.  
 
దీంతో అనుష్క కూడా సినిమా అవకాశాలు వచ్చినప్పుడు చూద్దామని.. అంతవరకు సైలెంట్‌గా ఉందామని నిర్ణయించుకున్నారట. తనకు తగ్గ క్యారెక్టర్ వస్తే మాత్రం డైరెక్టర్లే సంప్రదిస్తారని.. అంతేతప్ప తాను వెళ్ళి వారిని కలవాల్సిన అవసరం లేదంటోందట స్వీటీ అనుష్క. మరి చూడాలి.. వెండితెరపై గ్యాప్ లేకుండా అనుష్కకు అవకాశాలు ఎప్పుడు వస్తాయో?