1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 2 అక్టోబరు 2014 (18:31 IST)

నాగార్జున అంచనా కరెక్టేనట... ఒక లైలా కోసం రెడీ అవుతున్నారు...

అక్కినేని నాగార్జున పెద్ద బిజినెస్‌మేన్‌. సినిమాపరంగా ఏ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని అంటుంటారు. మనం విషయంలో అది రూఢీ అయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య నటించిన 'ఒక లైలా కోసం' సినిమా విడుదల చేయాల్సి వుంది. 
 
కానీ.. రభస, ఆగడు, గోవిందుడు వంటి చిత్రాలు రావడంతో... వారి మధ్యలో విడుదల చేయడం బాగోదని వాయిదా వేసినట్లు తెలియజేశారు. కానీ ఆ చిత్రాలేవీ పెద్దగా విజయాలు సాధించకపోవడంతో... వెంటనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది.
 
ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని ఈ నెల 17న  విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ డేట్‌లో ఏమాత్రం మార్పు వుండదని తెలుస్తుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, గుండెజారి గల్లంతయ్యిందే.. దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు.