శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (13:44 IST)

పవన్ ఎంట్రీ షాట్ ఖర్చు రూ. 50 లక్షలు... 'గోపాల గోపాల'

అదేమరి. ఓ నటుడి ఇమేజ్ పెరిగితే అతడిపై ఎంట్రీ షాట్ రూపంలో భారీగా డబ్బులు వెదజల్లుతారు. అలాంటి సంఘటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలోనూ జరిగింది. గోపాల గోపాల చిత్రంలో విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయాల్లో చిత్ర యూనిట్ హై క్వాలీటిని మెయింటెన్ చేస్తున్నట్లు షూటింగ్ స్టార్టింగ్ రోజు నుంచి తెలిసిన విషయమే. 
 
కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కోసం సుమారు 50 లక్షలతో విజువల్ వండర్‌ని క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్ ను పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కన్పించేటపుడు ఉపయోగిస్తారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.