Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏయ్ కమ్మీ.. నోరు జాగ్రత్త. మండిపడ్డ పవర్ స్టార్. బిత్తరపోయిన యూనిట్

హైదరాబాద్, సోమవారం, 10 జులై 2017 (07:51 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని అయ్ అయ్ ఆయ్ అంటూ పవన్ రంకె  వేశాడంటే గుండె అదరాల్సిందే. తానెందుకు ఎలా ఎగురుతున్నాడు. అలా ఎందుకు మండిపడుతున్నాడు అనేది ఎవరికీ అర్థంకాకపోవచ్చనేది మరో విషయం. కానీ షూటింగులో ఉండగా పవన్ బారిన పడితే వాళ్లు కోలుకోవడం కష్టమేనని చాలా సందర్బాలల్లో రుజువైంది. పవన్‌ వద్ద ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే చాలా ప్రమాదం అని తెలియని ఒక కమిడియన్ ఇటీవలే తనతో పెట్టుకుని జన్మకు సరిపడే అనుభవం సంపాదించుకున్నాడని వార్తలు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి కోపమొస్తే ఎలా వుంటుందో చాలామందికి తెలుసు. ఈసారి పవన్ చేతిలో ఆగ్రహానికి గురైంది ఓ కమెడియన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లోనే ఓ కమెడియన్ పవన్ కల్యాణ్ వద్ద పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారట. సినిమా షూటింగ్ జరుగుతున్న చోట జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొచ్చిన కమెడియన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.  నీ హద్దుల్లో నువ్వు వుంటే చాలా మంచిది అని పవన్ అతడిని కాస్త గట్టిగానే మందలించారట.
 
ఫిలింనగర్ టాక్ ప్రకారం పవన్ ఆగ్రహానికి గురైన కమెడియన్ పేరు ఏంటనేది బహిర్గతం కావడం లేదు కానీ అతడు నతిన్-త్రివిక్రమ్‌ల 'అ.. ఆ' సినిమాలోనూ నటించాడని మాత్రం తెలుస్తోంది
పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జులై 19న పవన్-త్రివిక్రమ్ మూవీ యూనిట్ యూరప్ ప్రయాణమవుతోంది. 20 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నారు.
 
పవన్ బారిన పడి నలిగిపోయిన ఆ కమెడియన్ ఎవరంటారా.. అ ఆ సినిమాను తల్చుకోండి మరి..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అక్కినేని నాగార్జున అసలు రాజకీయాల్లోకి రారు.. అదే నిజమైతే?: అమల అక్కినేని

వైకాపాలోకి అక్కినేని నాగార్జున చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సతీమణి, నటీమణి అమల ...

news

రజనీకాంత్ పార్టీలోకి ఆర్కే.రోజా...?

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో చివాట్లు తిని పార్టీని మారాలనుకున్న ఆర్కే.రోజా ...

news

అదే బెట్టరంటున్న శ్వేతాబసు...!

ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ కొంతమంది విటులతో అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత సినిమా ఛాన్సులు ...

news

అఖిల్‌ను వెంటాడుతున్న దురదృష్టం... రెండో చిత్రానికి అడ్డంకులు?

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని. ఈ యువ హీరో "అఖిల్" చిత్రం ద్వారా ...

Widgets Magazine