శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (15:49 IST)

చిరంజీవి ఖైదీ 150 సినిమా ఆడియో: పవన్ కల్యాణ్ హాజరవుతారా? డుమ్మా కొడతారా?

చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఇది కావడంతో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆ

చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి చేసే సినిమా ఇది కావడంతో ఆడియో వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఆడియో వేడుకకు మెగా హీరోలంతా హాజరవుతున్నారని.. ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఈ ఆడియో వేడుక ఉంటుందని సినీ జనం అంటున్నారు. 
 
అయితే మెగా ఫ్యామిలీకి దూరంగా వుంటున్న పవన్ కల్యాణ్.. చిరంజీవి ఖైదీ 150 సినిమా ఆడియో ఫంక్షన్‌కి వెళ్తాడా? లేదా అనేదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు అన్నయ్య చిరంజీవి వచ్చిన నేపథ్యంలో.. ఖైదీ 150 ఆడియో వేడుకకు కూడా తమ్ముడు రావాల్సిందేనని డిసైడైపోయాడట. కానీ పవన్ కల్యాణ్ ఖైదీ ఆడియోకు డుమ్మా కొట్టాలని భావిస్తున్నాడట ఆ టైమ్‌లో పవన్ కల్యాణ్ విదేశాలకు పెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని సినీ పండితులు చెప్తున్నారు.
 
ఇంకా ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియో వేడుకకు సంబంధించి మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మొద్దని.. ఏదైనా తాము అధికారికంగా ప్రకటిస్తామని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. దీన్నిబట్టి పవన్ ఆడియో ఫంక్షన్‌కు రారని కొణిదెల ప్రొడక్షన్ చెప్పకనే చెప్పిందంటున్నారు.. సినీజనం.