శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:24 IST)

సన్నీ లియోన్ 'కండోమ్ హోర్డింగ్'కు పోలీసు భద్రత!

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన భామ సన్నీ లియోన్. బాలీవుడ్ చిత్రాల్లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. అలాగే, పలు యాడ్‌లలో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ఓ యాడ్‌ పోస

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా మారిన భామ సన్నీ లియోన్. బాలీవుడ్ చిత్రాల్లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. అలాగే, పలు యాడ్‌లలో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన ఓ యాడ్‌ పోస్టర్‌కు ఏకంగా 15 మంది పోలీసులు భద్రతగా ఉన్నారు.
 
ఇటీవల సన్నీ లియోన్ ఓ కండోమ్ యాడ్‌లో నటించింది. ఈ యాడ్‌కు సంబంధించిన పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌‌గా గుజరాత్‌‌లోని సూరత్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రకటనలో గర్భా డాన్స్‌తో పోలుస్తూ ఈ కండోమ్ యాడ్ కనిపిస్తుంది. దసరా ఉత్సవాలు ప్రకటిస్తుండటంతో ఇది వివాదాస్పదమైంది. 
 
దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. సన్నీలియోన్ ఉన్న ఈ ప్రకటన ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని ఆరోపించారు. దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 15 మంది పోలీసులు ఆ కండోమ్ యాడ్ హోర్డింగ్‌కు కాపలాకాస్తున్నారు.