శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (21:11 IST)

ప్ర‌భాస్, బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పాడా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. గోపీకృష్ణా మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. వ‌చ్చే నెల నుంచి తాజా షెడ్యూల్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలావుంటే... ప్ర‌భాస్ కొత్త సినిమా గురించి ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన ప్ర‌భాస్ నిన్న బ్లాక్‌బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివని క‌లిసాడ‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య సినిమాకి సంబంధించి క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, కొర‌టాల చెప్పిన లైన్‌కి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. 
 
వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన మిర్చి సినిమా బ్లాక్‌బ‌ష్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ అంటే... అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డడం ఖాయం. ప్ర‌స్తుతం కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 
 
ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో కొర‌టాల సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. కొరటాల శివ‌ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తారని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని టాక్. మ‌రి... ఈసారి ప్ర‌భాస్‌ని కొర‌టాల ఎలా చూపించ‌నున్నారో..?