ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (21:13 IST)

హాట్ టాపిక్‌గా మారిన ప్ర‌భాస్ పారితోషికం!

Prabhas
Prabhas
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పారితోషికాన్ని పెంచేశాడ‌నే టాక్ ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తోంది. ఆ మ‌ధ్య విడుద‌లైన రాధేశ్యామ్ పెద్ద‌గా ఆడ‌లేదు. ఇంకా నాలుగు సినిమాలు లైన్‌లో వున్నాయి. వంద‌ల కోట్లు పెట్టి సినిమా రాధేశ్యామ్ ఇప్పుడు ఓటీటీకి వ‌చ్చేసింది. అయినా ఆయ‌న డిమాండ్ త‌గ్గ‌లేదు. ఈ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో కొంత మొత్తం ఇవ్వ‌డానికి ప్ర‌భాస్ సిద్ధంగా వున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇదిలా వుండ‌గా, స‌లార్ సినిమా షూట్‌లో భాగంగా ఆ సినిమాకు ఎక్కువ‌గా పారితోషికం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  అందుకు కార‌ణం ఆ సినిమాను రెండు భాగాలుగా తీయ‌డ‌మే.. దీంతో అద‌నంగా ప్ర‌భాస్ డేట్స్ ఇవ్వాల్సి వుంటుంది. మ‌రోవైపు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె. కూడా వుంది. మ‌రోవైపు రామాయ‌ణం బేస్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు.
 
స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స‌లార్ సినిమా షూటింగ్ ఎక్కువ కాలం జ‌ర‌గ‌డంతోపాటు దాన్ని రెండు భాగాలుగా చేయాల‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు డిసైడ్ కావ‌డంతో అద‌నంగా దాదాపు 20 కోట్లు పెంచిన‌ట్లు తెలిసింది. దీనికి నిర్మాత‌లు స‌మ్మ‌తించారు. ఇప్ప‌టికే పాన్ ఇండియాతోపాటు ప‌లు విదేశీ భాష‌ల్లో ప్ర‌భాస్ సినిమా వెళుతుంది. దాంతో ప్ర‌భాస్‌కు ఇవ్వ‌డం స‌మ్మ‌త‌మేన‌ని కొంద‌రు తెలియ‌జేస్తున్నారు. అయితే ఇటీవ‌ల కార్మికులు త‌న వేత‌నం 45 శాతం పెంచాల‌ని డిమాండ్ చేయ‌డం, దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో క‌మిటీ వేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌భాస్ పారితోషికం పెర‌గ‌డం హాట్ టాపిక్‌గా మారింది.