మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (17:18 IST)

బాహుబలితో ప్రభుదేవా సినిమా.. పౌర్ణమిలా?

బాహుబలి సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో వుంటుందని ఇప్పటికే సినీ యూనిట్ వెల్లడించింది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ సిని

బాహుబలి సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో వుంటుందని ఇప్పటికే సినీ యూనిట్ వెల్లడించింది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ ఫారిన్ లొకేషన్లలో జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రభుదేవా, తమన్నా జంటగా చక్రి తోలేటి రూపొందిస్తున్న హిందీ చిత్రంలోనూ కీలకమైన అతిథి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని బిటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఓ ద్విభాషా చిత్రంలో ప్రభాస్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ ‘పౌర్ణమి' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాఫ్‌గా నిలిచింది. అలాంటి డైరక్టర్‌తో తిరిగి బాహుబలి నటిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.