బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (15:43 IST)

కల్కి 2898 ADలో ఎస్ఎస్ రాజమౌళి?

Rajamouli
మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి కల్కి 2898 ADచిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో సై, బాహుబలి 1, మజ్ను వంటి చిత్రాలలో అతిధి పాత్రలో కనిపించిన రాజమౌళి.. తాజాగా ప్రభాస్- నాగ్ అశ్విన్ చిత్రం కల్కి 2898 ADలో కూడా గెస్ట్ పాత్రలో నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, లోఫర్ లేడీ దిశా పటాని కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
మరోవైపు, SS రాజమౌళి' తదుపరి ప్రాజెక్ట్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంది.ఈ చిత్రానికి కథను మణికర్ణిక, బాహుబలి సిరీస్, బజరంగీ భాయిజాన్ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాశారు.