గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 6 నవంబరు 2018 (13:44 IST)

ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్స‌వానికి ఆ ఇద్ద‌రు అగ్ర‌హీరోలు వ‌స్తున్నారా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. డీవీడీ దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించే ఈ సినిమాపై అటు మెగా ఫ్యాన్స్, ఇటు నంద‌మూరి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. స్వాతంత్ర్యంకి పూర్వం క‌ధాంశంతో ఈ సినిమా ఉంటుంద‌ని... చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గెట‌ప్స్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని... ఇలా రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సంచ‌ల‌న చిత్రానికి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ కూడా హాజ‌రు కానున్నార‌ని టాక్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ త‌రుపున చిరంజీవి, ఎన్టీఆర్ త‌రుపున బాల‌య్య హాజ‌రు కానున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ సంచ‌ల‌న సినిమా ప్రారంభోత్స‌వంలో ఇంకెంతమంది సినీ ప్ర‌ముఖులు పాల్గొంటారో అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. 11వ తేదీన 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా ఓపెనింగ్‌కి 11 మంది గెస్ట్‌ల‌ను ఆహ్వానించార‌ట‌. మ‌రి... ఆ 11 మంది ఎవ‌రో చూడాలి.