Widgets Magazine

శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

గురువారం, 27 జులై 2017 (17:32 IST)

సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో వుంటుందనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫోటో షూట్‌లో అదరగొట్టేసిన శివానీ.. హీరోయిన్‌గా ఎప్పుడు తెరపై కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు 'శివ'తో శివానీ జతకట్టనుందని టాక్. 
 
ఈ కుర్రాడు విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు పూర్తి కానుండటంతో, అతడిని హీరోగా పరిచయం చేసేందుకు రాజ్ కందుకూరి ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. అలా శివను హీరోగా నటించే సినిమాలో శివానిని హీరోయిన్‌గా తీసుకోవాలని రాజ్ కందుకూరి భావిస్తున్నారట. 
 
ఈ చిత్రం జనవరి 2018లో సెట్స్ పైకి వస్తుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని.. నటనలోనూ ట్రైనింగ్ తీసుకున్నాక శివ.. శివానీతో జత కలుస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక శివానీ తన సూపర్బ్ ఫోటో షూట్‌తో ప్రేక్షకుల మధ్య హీరోయిన్‌ రోల్‌కు అదిరిపోతుందని ముద్ర వేసుకుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్‌ బాస్ హౌస్‌కు హాటెస్ట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్.. ఎవరు?

తెలుగులో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మా స్టార్ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ ...

news

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో ...

news

ముగ్గురు పిల్లలతో బల్గేరియాలో స్టార్ హీరో జాలీ ట్రిప్‌...

టాలీవుడ్‌కు చెందిన ఆ హీరోకు మూడు పెళ్లిళ్లు. ఇందులో ఇద్దరు భార్యలు విడాకులు తీసుకున్నారు. ...

news

ముంబైకొచ్చిన లండన్ లవర్.. కారులో కౌగిట్లోబంధించి ముద్దులు పెట్టిన హీరోయిన్.. (ఫోటోలు)

టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రహీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. ఈమె ...