శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 23 జులై 2015 (11:11 IST)

చిరంజీవి 150 చిత్రంలో విలన్‌గా చేస్తాడట... రాజశేఖర్‌కు చిరు ఓకే అంటాడా...?

హీరోయిన్లు టీనేజ్ దాటగానే ఆంటీల పాత్రలు వేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు సీనియర్ హీరోల పరిస్థితి కూడా అలాగే మారిపోతోంది. ఒక్క బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి వారు తప్ప మిగిలిన హీరోలు మెల్లగా బాబాయి, నాన్న పాత్రలు వేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జగపతి బాబు ఒకడుగు ముందుకు వేసి విలన్ పాత్రలు వేసేందుకు సిద్ధమైపోయాడు. 
 
తాజాగా ఈ వరుసలోకి నటుడు రాజశేఖర్ కూడా చేరిపోతున్నట్లు కనబడుతున్నారు. చిరంజీవి 150వ చిత్రంలో యాంటీ హీరో పాత్ర చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ సంకేతాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమాలో చిరు పాత్రకు సరిసమానంగా ఉంటే ప్రతినాయకుడిగా చేయడానికి రెడీ అని ఎప్పటినుండో చెబుతున్నాడు. 
 
కానీ ఇప్పుడా కండిషన్లు పక్కన పడేశారట. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఏవైనా సరే నటిస్తానని అంటున్నారట. ఎలాగూ హీరో పాత్రలు రావు కనుక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారితే మరిన్ని అవకాశాలు వస్తాయి మరి. చూద్దాం రాజశేఖర్ అడుగుతున్నట్లు చిరంజీవి 150వ చిత్రంలో విలన్ పాత్ర ఏదైనా వస్తుందేమో...?!!