Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీ - సుక్కు సినిమా కథ లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (17:35 IST)

Widgets Magazine
ram charan new movie still

మెగా పపర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను యూనిట్ విడుదల చేసింది. కాడెత్తుకుని వెళుతున్న రాంచరణ్‌ పోస్టర్ నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు 'రేపల్లె' లేదా 'పల్లెటూరి ప్రేమలు' అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అయితే సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తోంది. సుకుమార్ తీయాలనుకుంటున్న కథ నెట్‌లో లీకయిందంటూ ప్రచారం జరుగుతోంది.
 
కథ ఇదేనంటూ ఓ స్క్రిప్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం సినిమా కథేంటంటే... హీరో పక్కా పల్లెటూరి కుర్రాడు. అందరితో కలిసిమెలిసి ఉంటుంటాడు. అలాంటి యువకుడు అనుకోకుండా ఓ పని మీద సిటీకి వెళ్లాల్సొస్తుంది. సిటీలోనే ఓ ప్రయోగశాలలో పనికి కుదురుతాడు. అక్కడున్న శాస్త్రవేత్తలు మనిషిపై ఓ ప్రయోగం చేయాలన్న దుర్భుద్దితో ఉంటారు. 
 
ఈ యువకుడిపై వారి కన్నుపడుతుంది. ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు హీరోపై ప్రయోగం చేశారా? ఒకవేళ చేస్తే ఆ తదనంతరం జరిగిన పరిణామాలేంటి అనే విషయాలను సుకుమార్ ఆసక్తికరంగా తెరకెక్కించనున్నాడని టాక్. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే. ఒక స్టార్ హీరోతో ఓ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా తీయాలనుకున్నప్పుడు ఇలాంటి కథలు తెరపైకి రావడం కొత్తేమీ కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

30 సెకన్లలో కోటి వ్యూస్... ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నది ముఖ్యం (టీజర్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'. డాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ...

news

నిర్మాతల మండలి ఎన్నికల బరిలో విశాల్... మద్దతు తెలిపిన కమల్‌హాసన్

తమిల చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో కోలీవుడ్ యువ హీరో విశాల్ నిలిచారు. ఆయనతో పాటు.. ...

news

"మనమంతా దుర్యోధనులం... పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం": రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక వచనాలు పలికారు. "మనమంతా దుర్యోధనులం... ...

news

కామెంట్లను పట్టించుకుంటే ఇక పనిచేసినట్లే.. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకొచ్చినట్లే అంటున్న శ్రుతి

ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. ఇతరుల నుంచి ...

Widgets Magazine