శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (16:05 IST)

రామ్‌ చరణ్‌ 'ఫైటర్' ఫిక్స్‌ అయ్యేట్లుంది!

రామ్‌ చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'బ్రూస్‌లీ' అనే పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పటికే ఈ చిత్ర టైటిల్‌ను తమిళ సినిమాకు పెట్టడంతో దాన్ని పెట్టడానికి అభ్యంతరాలు వెలువడ్డాయి. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి బ్రూస్‌లీ పెట్టారు. అందుకే రామ్‌ చరణ్‌ చిత్రానికి ఫైటర్‌ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. 
 
కథ ప్రకారం... కూడా టైటిల్‌ సరిపోతుందని తెలుస్తోంది. అసలు చిత్రంలోని పాయింట్‌.. బ్రూస్‌లీకి కనెక్ట్‌ అయి వుంటుందనీ, కానీ తమిళ సినిమాకు టైటిల్‌ పెట్టడంతో దాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. చిత్ర కథ ప్రకారం.. రామ్‌ చరణ్‌.. అనుకోకుండా ఫైటర్‌గా మారాల్సి వస్తుంది. అది ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.