Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ క్యారెక్టర్ చేస్తే రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే.... ఎవరు..?

సోమవారం, 19 జూన్ 2017 (11:55 IST)

Widgets Magazine
ramyakrishna

రమ్యకృష్ణ... ఇప్పుడు రమ్యకృష్ణ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వకతప్పదు. వరుస హిట్లతో తెలుగు సినీపరిశ్రమలో దూసుకుపోతోంది రమ్యకృష్ణ. 'బాహుబలి' సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక రాజ్యానికి రాణిగా, ఇద్దరు పిల్లలను వీరయోధులుగా తయారు చేసిన తల్లిగా రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్ ప్రపంచ సినీరంగాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. రమ్యకృష్ణ ఇప్పటి నటి కాదు. ఎప్పటి నుంచో హీరోయిన్‌గా రాణించిన రమ్యకృష్ణ ఆ తర్వాత అత్త, అమ్మ పాత్రల్లో నటించడం ప్రారంభించింది. కానీ రమ్యకృష్ణకు ఇప్పుడు క్రేజ్ పెరగడంతో ఆమె నటించేందుకు రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసిందట. అది కూడా రూ.2 కోట్ల పైమాటే.
 
మెగాస్టార్ చిరంజీవి నుంచి అందరు అగ్రహీరోయిలతో నటించిన హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోకు పోటీగా డ్యాన్స్‌లు, డైలాగ్‌లు చెప్పడంతో రమ్యకృష్ణ మేటి. ఇది అందరికీ తెలిసిందే. అయితే వివాహం తర్వాత రమ్యకృష్ణ కొన్నిరోజుల పాటు గ్యాప్ తీసుకున్నారు. పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ ఆ తర్వాత అత్త, అమ్మ క్యారెక్టర్లను సినిమాల్లో వేయడం ప్రారంభించారు. అంతేకాదు సీరియళ్ళలో కూడా నటిస్తూ వచ్చారు. బాహుబలి సినిమాలో రాజమౌళి ఇచ్చిన శివగామి క్యారెక్టర్ రమ్యకృష్ణ ఎంతో మంచిపేరును తెచ్చిపెట్టింది. 
 
దీంతో రమ్యకృష్ణ తన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తే తన క్యారెక్టర్‌కు రూ.2 కోట్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతోందట రమ్యకృష్ణ. చిన్న సినిమాలైతే కోటి రూపాయల వరకు ఇస్తే చాలట. హీరో, హీరోయిన్లలకే ఇంత మొత్తంలో ఇవ్వని నిర్మాతలు రమ్యకృష్ణకు అంత డబ్బులిచ్చి నటింపజేస్తారా? అనేది అనుమానమే. అయితే తనకు సినిమా ఛాన్సులు రాకపోయినా ఫర్వాలేదు గానీ తాను అడిగినంత రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వాలని పట్టుపడుతోందట రమ్యకృష్ణ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అవార్డులు నూలుపోగుతో సమానం : చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదనీ మెగాస్టార్ ...

news

ప్రేమ విఫలం.. ఫినాయిల్ తాగి నటుడి ఆత్మహత్యాయత్నం

ప్రేమ విఫలం కావడంతో ఓ నటుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన నివాసంలోనే ఫినాయిల్ ...

news

బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు.. జాతీయ మీడియాలో ప్రచారం

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ...

news

ఉయ్యాలవాడలో ముగ్గురు హీరోయిన్లా.. నేషనల్‌కి ఐశ్వర్యారాయ్, ఇంటర్నేషనల్‌కి ప్రియాంక.. అది చరిత్రేనా..

ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం జరగడానికి పది సంవత్సరాల ముందే రాయలసీమలో బ్రిటిష్ వారికి ...

Widgets Magazine