శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By కుమార్ దళవాయి
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:32 IST)

రానా మామూలోడు కాదు... హాలీవుడ్ ఆఫర్‌నే పెండింగ్‌లో పెట్టాడట...

వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రానాకు హీరోగా అంత క్రేజ్ రాకపోయినప్పటికీ బాహుబలి రూపంలో ప్రపంచస్థాయి క్రేజ్ వచ్చింది. జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న రానా నటించే సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో విడుదలవుతున్నాయి.
 
అయితే రానా ఇక మీదట భారతీయ సినిమాల్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించబోతున్నట్లు సమాచారం. ఫిలింనగర్ వర్గాల సమాచారాన్ని బట్టి హాలీవుడ్‌లో తీయబోయే ఒక యాక్షన్ సినిమా కోసం ఇప్పటికే రానాను సంప్రదించడం జరిగిందట. అయితే రానా ఇప్పుడు హాథీ మేరీ సాథీ, రాజా మార్తాండ వర్మ వంటి బహుభాషా చిత్రాల్లో నటిస్తున్నందు హాలీవుడ్ ఆఫర్‌ను ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారని, డేట్స్ సర్దుబాటు చేసుకుని హాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పాలనుకుంటున్నట్లు వినికిడి.
 
అయితే హాలీవుడ్ చిత్రంలో రానా నటించేది పూర్తి స్థాయి పాత్రలోనా లేక అతిథి పాత్రలోనా అన్న విషయం తెలియాల్సి ఉంది.