మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (13:11 IST)

విజయ్ దేవరకొండ చాలా డేరింగ్.. రష్మిక ట్వీట్.. త్వరలో పెళ్లి?

Rashmika Mandanna & Vijay Deverkonda
టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని టాక్ వస్తోంది. ఈ జంట ప్రేమలో వుందని పుకార్లు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ తమ బంధాన్ని బలపరుచుకోనున్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ మధ్య రష్మిక ట్వీట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మిక గురించి ఒక అభిమాని పోస్ట్ చేస్తూ.. రష్మిక భర్త విజయ్ దేవరకొండ (చాలా డేరింగ్) లాగా ఉండాలి. ఆమెను రక్షిస్తాడు. అతను రాజుగా ఉండాలి... అంటూ పేర్కొంది. దీనిపై రష్మిక స్పందిస్తూ, "ఇది చాలా నిజం" అని చెప్పింది.
 
 తద్వారా అభిమాని పరోక్షంగా విజయ్‌ని పెళ్లాడనుందని.. ఆమె కాబోయే భర్త విజయ్ దేవరకొండ అని అర్థం చేసుకుంటారు. అంతకుముందు, రష్మిక విజయ్ సన్ గ్లాసెస్‌తో కనిపించింది.
 
ఇది నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. ఇదే సందర్భంలో, రష్మిక మరియు విజయ్ ఒకే రిసార్ట్ నుండి తమ వెకేషన్ చిత్రాలను పోజులిచ్చారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. 
 
ఇకపోతే.. విజయ్ దేవరకొండ, రష్మికల వివాహానికి ఇద్దరి తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.