శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 9 మార్చి 2015 (12:20 IST)

బేనజీర్ భుట్టో... విద్యాబాలన్‌ ప్లేస్‌లో రవీనా టాండన్...

ఒకప్పటి బాలీవుడ్‌ కథానాయిక రవీనా టాండన్‌ త్వరలో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టోగా మారబోతుంది. ఆశ్చర్యంగా ఉందా..? అవును. రవీనా టాండన్‌ బేనజీర్‌ భుట్టోగా నటించడానికి సిద్ధమవుతోంది. అయితే బాలీవుడ్‌లో ఇప్పటికే బయోగ్రఫీ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. ఇటీవలే ప్రియాంకా చోప్రా 'మేరికోమ్‌' పాత్రలో నటించి సంచలనాలు సృష్టించింది. 

 
ప్రముఖుల వ్యక్తిగత జీవితాల ఆధారంగా ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా సినిమాలు రాబోతున్నాయి. అందులో భాగంగానే చాలా రోజులుగా 2007లో ఎన్నికల ప్రచారంలో ఉగ్రవాదులచే హత్యకు గురైన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో జీవితం ఆధారంగా సినిమాను తీయాలని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
 
మొదట ఈ పాత్ర కోసం విద్యాబాలన్‌ వద్దకు వెళ్లగా.. ఆమె అనాసక్తి చూపించడంతో.. రవీనాటాండన్‌ వద్దకు వచ్చినట్లు బాలీవుడ్‌ సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకనిర్మాతలు ఎవరు... ఇంకా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.