సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (22:46 IST)

నటి మహాలక్ష్మి మొగుడు మోసగాడా? ఎన్నారై వద్ద డబ్బు తీసుకుని?

Mahalakshmi
ప్రముఖ టి.వి. నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న నిర్మాత రవీందర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఫేమస్. కొన్ని చిత్రాలను నిర్మించిన రవీందర్‌పై చీటింగ్ కేసు ఫిర్యాదు నమోదైంది. యుఎస్‌లో నివసిస్తున్న భారతీయుడు (ఎన్నారై) విజయ్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇంకా ఎన్నారై ఫిర్యాదులో.. "ఓ యాప్ ద్వారా తనకు పరిచయం అయిన రవీందర్ తనకు బాగా క్లోజ్ అయ్యాడని ఫిర్యాదులో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఆ తర్వాత గతేడాది మేలో రూ.20 లక్షలు అప్పు అడిగాడు. ఓ సినిమా నటుడికి 'అడ్వాన్స్‌' ఇస్తానని చెప్పి ఈ డబ్బు అడిగాడు. నా వద్ద రూ.15 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పి రవీందర్ బ్యాంకు ఖాతాకు 2 దఫాలుగా డబ్బులు పంపించాను. 
 
రవీందర్ చెప్పినట్టు ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదు. కొన్నిసార్లు అసభ్యకరంగా మాట్లాడేవాడు. అప్పుడు అతను కాల్స్ తీసుకోకుండా సెల్‌ఫోన్‌లో నా నెంబర్‌ను బ్లాక్ చేశాడు. రవీందర్ నా దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నందున ఈ విషయంపై సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. " అని పేర్కొన్నాడు. దీంతో నిర్మాత రవీందర్ వెంటనే ఈ డబ్బు ఇస్తానని చెప్పడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ రవీందర్ ఇప్పటి వరకు విజయ్‌కు రావాల్సిన డబ్బు చెల్లించలేదని అంటున్నారు. 
 
ఈ కేసులో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రవీందర్‌పై మోసం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై రవీందర్‌కు సమన్లు ​​అందజేసి మంగళవారం చెన్నైలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ఈ విషయమై వివరణ ఇచ్చారు. తదుపరి చర్యలు తీసుకుంటామని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.