శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 22 ఆగస్టు 2015 (19:33 IST)

ఇరవై నిముషాల ట్రిమ్‌తో... కిక్ 2, కత్తిరిస్తున్నారట...

రవితేజ 'కిక్‌ 2' సినిమా శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున విడుదలైంది. రవి తేజ కెరీర్లో బిగ్గెస్ట్‌ రిలీజ్‌గా నిలిచిన ఈ సినిమా, ఫస్ట్‌డే కలెక్షన్స్‌ విషయంలోనూ సత్తా చాటింది. ఇక మొదటిరోజు ఈ సినిమాకు అన్నిచోట్లా మంచి టాక్‌ వచ్చినా, సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్‌ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వేగం పెరిగి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపించింది. ఈ విషయాన్ని గుర్తించిన చిత్ర యూనిట్‌ వెంటనే తగు చర్యలను చేపట్టింది.
 
సుమారు 20 నిమిషాల సన్నివేశాలను తగ్గిస్తున్నట్లు సమాచారం. రేపు, ఎల్లుండికల్లా అన్నిచోట్లా ఈ ట్రిమ్‌ వెర్షన్‌ ప్రదర్శితం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి, రవితేజ కాంబినేషన్లో 2009లో వచ్చిన కిక్‌ సినిమాకు సీక్వెలే ఈ కిక్‌ 2. హీరో కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించగా, థమన్‌ సంగీత దర్శకత్వం వహించారు.