బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న హీరో రవితేజ కుమారుడు?

Raviteja_Son
చిత్రపరిశ్రమలోకి వారసులు రావడం కొత్త కాదు. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటికే అనేక మంది వారసులు కొనసాగుతున్నారు. తాజాగా మరో హీరో తనయుడు వెండితెర అరంగేట్రం చేయనున్నారు. తెలుగులో మాస్ మహారాజ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న రవితేజ తనయుడు మహాధన్‌ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. 
 
కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో మంచి గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహాధాన్ హీరోగా పరిచయం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఒక యూత్‌ఫుల్ స్టోరీతో కాలేజీ నేపథ్యంలో సాగే చిత్రంలో మహాధన్‌ హీరోగా అయితే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. ఇదే విషయంపై హీరో రవితేజను సంప్రదించగా, ఆయన కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఓ క్లారిటీ రావాల్సివుంది. 
 
కాగా, మరో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. పెళ్లిసందడి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇపుడు మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు కమిట్ అయ్యాడు. అలాగే, త్వరలో రవితేజ కుమారుడు కూడా హీరోగా పరిచయంకానున్నారు.