సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (19:25 IST)

ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య! (video)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వెండితెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. అదీ కూడా ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్న తదుపరి ప్రాజెక్టులో ఆమె ఎంట్రీ ఇవ్వనుంది. తన స్థాయికి తగ్గా మంచి ఆఫర్లు వస్తే నటించడానికి అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రముఖ నటుడు మహేశ్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటించనుంది. 
 
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సంస్థ తాజాగా 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. 
 
ఇందులో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ, చాలా పవర్ ఫుల్ పాత్ర అని సమాచారం. ఇదే అంశంపై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.