మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (13:24 IST)

విజయ్ వర్మతో తమన్నా పెళ్లి.. అదీ త్వరలోనే..?

tamannah
స్టార్ హీరోయిన్, తమన్నా, ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట తరచుగా ఈవెంట్‌లు, పార్టీలలో కలిసి కనిపిస్తున్నారు. తాజాగా అనేక ఇంటర్వ్యూలలో, తమన్నా విజయ్‌తో తన పెళ్లి పుకార్లను ఖండించింది. ఇప్పుడే పెళ్లి చేసుకోనని తెలిపింది. 
 
కానీ త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని ముంబై సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. తమన్నాకి ఎక్కువ సినిమాలు చేతిలో లేకపోవడంతో.. ఆమె విజయ్‌తో కలిసి ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త అంతటా వైరల్‌గా మారింది.
 
తమన్నా తన చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి చేసుకోవాలని తన మనసులో ఉందని, తల్లిదండ్రులు కూడా తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారని వెల్లడించింది. మరి రానున్న రోజుల్లో తమన్నా ఏం చేస్తుందో చూడాలి.