శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:22 IST)

సాయిపల్లవిని అలా చేస్తున్నారు... అయినా ఆ నిర్మాత మాత్రం..?

కొందరు ఆమెను బ్యాడ్ చేయాలని ట్రై చేశారు. కానీ ఆమెకు ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సాయిపల్లవి యాటిట్యూడ్ గురించి చాలా ప్రచారం జరిగింది. ఆమె యాటిట్యూడ్ వల్లే దర్శకనిర్మాతలు ఆమెను తొలగిస్తున్నారన్నమాట కూడా వినిపించింది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్ర

కొందరు ఆమెను బ్యాడ్ చేయాలని ట్రై చేశారు. కానీ ఆమెకు ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల సాయిపల్లవి యాటిట్యూడ్ గురించి చాలా ప్రచారం జరిగింది. ఆమె యాటిట్యూడ్ వల్లే దర్శకనిర్మాతలు ఆమెను తొలగిస్తున్నారన్నమాట కూడా వినిపించింది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఆమెకు బిగ్ ఆఫర్ ఇవ్వడం విశేషం. 
 
సాయిపల్లవికి చాలా టెక్కు అన్న ప్రచారాన్ని కొందరీ మధ్య మొదలుపెట్టారు. ఫిదా సినిమాతో తెలుగువారికి చేరువైన ఈ అందాల భామ గురించి కావాలని కొందరు బ్యాడ్ పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఆమె కెరీర్‌కి హాని చేయాలని కొంతమంది ప్రయత్నించినా పల్లవికి ఉన్న ప్యాపులారిటీ ఏ మాత్రం తగ్గడం లేదు. దిల్ రాజు నిర్మించిన ఫిదా సినిమాతోనే తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత దిల్ రాజు నిర్మించిన ఎంసిఎ సినిమాలో నాని సరసన నటించింది. 
 
ఇది కూడా సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు శర్వానంద్ సరసన పడిపడి లేచే మనసు సినిమాలో నటిస్తోంది. ఈ యేడాది సాయిపల్లవికి దిల్ రాజు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సాయిపల్లవి చాలా ట్యాలెంటెడ్ హీరోయిన్ అని తెలుగు సినీపరిశ్రమే చెబుతోంది. ఆమె నటన, డ్యాన్స్ అంతా అద్భుతంగా ఉంటుందని దర్శకులే చెబుతుంటారు. తక్కువ కాలంలోనే ఈ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి మొదటగా చెబుతున్నారు సినీపరిశ్రమలోని వారు. 
 
నితిన్‌తో పాటు శర్వానంద్‌లతో సాయిపల్లవికి అవకాశం కల్పిస్తున్నారు దిల్ రాజు. జూలైలో హరీష్‌ శంకర్ దర్శకత్వంలో త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సినిమాలో సాయిపల్లవికి అవకాశం ఇచ్చారు దిల్ రాజు. తెలుగు సినీపరిశ్రమలో దిల్ రాజు తప్ప సాయిపల్లవికి అవకాశాలు ఇచ్చే వారెవరూ లేరనే ప్రచారం కూడా జరుగుతోంది.