Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పుడు ప్రేమమ్, ఇప్పుడు ఫిదా, రేపు 'కరు' మూడు చిత్రసీమల్లో సాయిపల్లవి జైత్రయాత్ర

హైదరాబాద్, శుక్రవారం, 28 జులై 2017 (05:35 IST)

Widgets Magazine
sai pallavi

మలయాల కుట్టి సమంత, పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సినీ అవకాశాలను తన్నుకుపోతున్న లక్కీ హీరోయిన్ల జాబితాలో సాయి పల్లవి చేరిపోయింది. దక్షిణాదిలో కన్నడ మినహాయిస్తే మిగిలిన మూడు చిత్రసీమల్లో ఇప్పుడు సాయిపల్లవిదే హవా. ఎంతగానంటే సమంత, రకుల్ ఇద్దరూ జెలసీ ఫీలయ్యేంత హవా నడుస్తోంది. కేవలం రెండే రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ఇప్పుడు చిత్ర సీమ దృష్టిలో విజయాలకు మారుపేరు. ఆమె ఉంటే చాలు థియేటర్లలోకి జనం వస్తారు అనేంతగా ఇప్పుడు పల్లవి పేరు ఇండస్ట్రీ వర్గాల్లో మారుమోగుతోంది. 
 
సాయిపల్లవి.. ఈ పేరు ఇటీవల టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. అంతకు ముందే మాలీవుడ్, కోలీవుడ్‌లలో మారుమోగింది. 2015 తెరపైకి వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్‌ అనూహ్య విజయాన్ని సాధించింది.అందులో మలర్‌గా టీచర్‌ పాత్రలో సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.అంతే కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కట్టాయి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నుంచి గౌతమ్‌మీనన్‌ వరకూ పలువురు తమ చిత్రాల్లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు.
 
అయితే అలాంటి పెద్దపెద్ద అవకాశాలను కూడా నిరాకరించిన ఈ కేరళకుట్టి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగేస్తూ చివరికి టాలీవుడ్‌ చిత్రం ఫిదాలో నటించడానికి  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతోంది. అదేవిధంగా కోలీవుడ్‌లో పలు అవకాశాలను వదులుకున్న సాయిపల్లవి విజయ్‌ దర్శకత్వంలో నటించడానికి సమ్మతించింది. ఆయన దర్శకత్వంలో నటిస్తున్న కరు అనే చిత్రం నిర్మాణంలో ఉంది. 
 
మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంతోనూ, తెలుగులో ఫిదా చిత్రంతోనూ విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో కరు చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవడానికి ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతల కన్ను సాయిపల్లవిపై పడిందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. 
 
చిత్రసీమకు సంబంధించినంత వరకు ఇపుడు వీస్తున్న గాలి సాయి పల్లవిదే అంటే అతిశయోక్తి కాదు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బొమ్మరిల్లు తర్వాత క్లాస్, మాస్ ఇద్దరినీ అలరిస్తున్న స్వచ్ఛమైన సినిమా ఫిదా.. ఆనందంలో యూనిట్

ఫిదా చిత్రం అందరి అంచనాలను తల్లకిందులో చేస్తు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ పిక్చర్లలో ...

news

మళ్లీ మీతో రెండోసారా...? నో చెప్పేసిన రకుల్ ప్రీత్ సింగ్... ఎవరికి?

రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ స్టార్. ఈమె ప్రస్తుతం ...

news

అనుష్క లేకుంటే 'సాహో'లో నటించనని ప్రభాస్ అంటున్నాడా?

బాహుబలి రెండు భాగాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ...

news

శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో ...

Widgets Magazine