శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 14 నవంబరు 2018 (18:56 IST)

వరుణ్‌ తేజ్‌తో టచ్‌లో ఉన్న సాయిపల్లవి.. ఎందుకు?

సాయిపల్లవిలో జోరు తగ్గిందా.. ఆమెకు ఛాన్సులు తగ్గాయా. ఈ విషయంపై సాయిపల్లవే స్పష్టత ఇస్తోంది. స్లో అండ్ స్టడీ అవసరం అంటోంది. ఆవేశపడి సంవత్సరానికి 5 సినిమాలు చేయడం కన్నా.. ఆలోచించి.. మంచి కథతో ఉన్న సినిమాలు రెండు చేస్తే చాలంటోంది సాయిపల్లవి. ఉన్నట్లుండి సాయిపల్లవిలో ఎందుకీ మార్పు..
 
సాయిపల్లవి పూర్తిగా స్లో అయ్యింది. ఎందుకో ఏ రేంజ్‌కో వెళుతుందనుకున్న సాయిపల్లవి ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఎంసిఎ హిట్‌తో ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చింది. అయితే ఈ యేడాది కణం సినిమా తప్ప మరొకటి విడుదల చేయలేదు. ప్రస్తుతం సాయిపల్లవి పడిపడి లేచే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరో. వచ్చే నెల 21వ తేదీన విడుదల కానుంది. 
 
మొదట్లో ఈ సినిమా కోసం చాలా డేట్స్ ప్రకటించారు. చివరకు డిసెంబర్ 21వ తేదీని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సూర్య సరసన ఎన్ జికె మూవీలోను, ధనుష్ సరసన మారి సినిమాలోను నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే యేడాది విడుదల కానున్నాయి.

సినీ పరిశ్రమలో తనకున్న మంచి పేరును అలాగే కొనసాగించాలన్న ఆలోచనతోనే సాయిపల్లవి తన వేగాన్ని తగ్గించిందట. తనకు బాగా నచ్చిన హీరో వరుణ్‌ తేజ్ సలహాతో ఆచితూచి అడుగులు వేస్తోందట సాయిపల్లవి. కథ నచ్చి, సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంటేనే సినిమాలు చేయమని వరుణ్‌ చెప్పడంతోనే సాయిపల్లవి ఇలా చేస్తోందంటూ సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.