బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (15:08 IST)

సల్మాన్ ఖాన్ సరసన సమంత?

samanta
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించనున్నట్టు సమాచారం. ఆమె నటించే చిత్రం కూడా ప్రాంతీయ చిత్రం కాదు. బాలీవుడ్ చిత్రం. కరణ్ జోహార్ నిర్మాతగా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో సమంత కథానాయికగా నటించబోతోందంటూ ప్రచారం సాగుతోంది. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెల్లనుంది. అయితే సమంత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటుంది చికిత్సకు ఎంతకాలం పడుతుందో, తిరిగి సమంత ఎప్పుడు కోలుకొని కెమెరా ముందుకు వస్తుందో తెలీదు. ఈ విషయంలో సమంత దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదట. అందుకే ఈ సినిమా చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిందని తెలుస్తోంది. 
 
కాగా, సమంత నటించిన 'ఖుషి' ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. సమంత పాత్రకూ మంచి పేరొచ్చింది. ఈ జోష్ ఇలానే కొనసాగించాలంటే మంచి ప్రాజెక్టులు అందిపుచ్చుకోవాలి. అందుకోసమైనా సల్మాన్ సినిమా 'ఒకే' చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం.